|
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సామాగ్రి వాహనానికి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
సంగారెడ్డి టౌన్ జనంసాక్షి
ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సేవా దృక్పథంతో సమాజసేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శరత్ పిలుపు నిచ్చారు.
శనివారం కలెక్టరేట్ ఆవరణలో శిక్షనాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిలు, జామెట్రీ బాక్స్ లు, తదితర సామాగ్రి వాహనానికి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన శిక్షనాం సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ, సేవాతత్పరత ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమం చేపట్టి తద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలుమార్చి, అన్ని హంగులతో సకల సౌకర్యాలను సమకూర్చి, విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ, సేవాతత్పరత తో
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విధమైన సహాయాన్ని అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
జిల్లాలోని 46 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5 వేల మందికి పైగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిలు, జామెట్రీ బాక్స్ లు, ఇతర స్టేషనరీ అందజేస్తున్నట్లు శిక్షనాం ట్రస్ట్ అధ్యక్షులు కమలాపురం మల్లికార్జున్ తెలిపారు.
పుల్కల్, చౌట కూర్ మండలాల్లోని 36 ప్రాథమిక పాఠశాలలు, 6 అప్పర్ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు, కంది, మునిపల్లి మండలాల్లోని 4 పాఠశాలల విద్యార్థులకు ఇట్టి సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, శిక్షనాం ట్రస్ట్ అధ్యక్షులు కమలాపురం మల్లికార్జున్, సభ్యులు ప్రవీణ్, సిద్ధూ ,శ్రీకర్, కిరణ్,చరణ్ ,ఉషశ్రీ,ప్రశాంతి ,శివ, ఉ మ్మి, శశాంక్, సమీర్, రఘు, నిరాల్,నరేష్ ,రాజేష్, లింగం, అభిషేక్, నవీన్ ,అశోక్, సునీల్ ,వర, సంఘి, విష్ణు ,రాగమాల ,ప్రదీప్, సుబ్బు నాగార్జున, సుమన్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|
![]() |
సామాజిక స్పృహ సేవా దృక్పథం కలిగి ఉండాలి….





