హైదరాబాద్ : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ రాసినట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ‘ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు – మానవ హక్కు’ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏచూరి ప్రసంగించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై చర్చించేందుకు పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జాతీయ మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని గుర్తు చేశారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ రంగం తగ్గిపోతోందని, సమాన అవకాశాలు దక్కాలంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు తప్పనిసరి అని నొక్కాణించారు. దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని, రిజర్వేషన్లు సమీక్షించాలని ఆర్ఎస్ఎస్, వీహెచ్ పి డిమాండ్ కు సీపీఎం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, జస్టిస్ చంద్రకుమార్, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు.




