Tuesday, 3 November 2026

ప్రైవేట్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి :ఆఫ్జల్ ఖాన్

:శామీర్ పేట్, జనం సాక్షి :16 అక్టోబరు నగరంలో జరిగే ప్రైవేట్ ఉపాధ్యాయుల సన్మాన సభ కు కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ కు నాన్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ విజయ్ సింగ్ ఠాకూర్ , అధ్యక్షులు విజయ్ కుమార్ లు ఆహ్వానం నిమిత్తం అఫ్జల్ ఖాన్ నివాసం లో ఆయనతో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ విజయ్ సింగ్, విజయ్ కుమార్ లకు శాలువా కప్పి సన్మానించారు. అదే విధంగా ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి మద్దతుగా నిలవాలని విజయ్ సింగ్ అఫ్జల్ ఖాన్ ను కోరగా వారు సానుకూలత వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వీరు విలేకరులతో మాట్లాడుతు సమాజ సేవ లో చురుకుగా పాల్గొంటున్న అఫ్జల్ ఖాన్ కు అక్టోబరు 16 వ తేదిన జరిగే సభలో ఘనంగా సన్మానించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్, విజయ్ సింగ్, విజయ్ కుమార్ లతో పాటు నాన్ గవర్నమెంట్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షాహ్ నవాజ్, ఎన్జిటిఎల్ఎఫ్ మెంబర్ సల్మాబేగం, స్థానిక టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మండల నాయకులు తాడెం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
30మైనర్టీ -1: మైనార్టీ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న దృశ్యం