Tuesday, 3 November 2026

ప్రొఫెసర్‌ మారంరాజు మృతికి కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,మే4 (జ‌నంసాక్షి):   ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ మారంరాజు సత్యనారాయణ రావు శనివారం ఉదయం కన్నుమూశారు. తొలి దశ ఉద్యమకారుడు మారంరాజు సత్యనారాయణ రావు మృతి పట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో మారంరాజు కీలకపాత్ర పోషించారని పేర్కొంటూ కెసిఆర్‌ ఆయన సేవలను కొనియాడారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ప్రొఫెసర్‌ మారం రాజు ఇవాళ తెల్లవారుజామున తనువు చాలించారు.