ప్లాట్‌ఫాం టికెట్కు బాదుడు

రూ.10 నుంచి రూ.50కి పెంపు

హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి):కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 250 రైల్వేస్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50లకు పెంచుతున్నట్లు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్ ఫాంపై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధర రేపటి నుంచి అమల్లోకి రానుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పెంచిన ధర అమల్లో ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి పై నాంపల్లి ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత రైల్వే అన్ని తీసుకుంటోంది. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో ప్రత్యేక పరిశుభ్రతా చర్యలు తీసుకుంటున్నారుసిబ్బంది ప్రయాణికుల చేతులకు శానిటైజర్ స్పే చేసారు. చేస్తున్నారు.

తాజావార్తలు