Wednesday, 4 November 2026

ప్లాస్టిక్‌ రహిత గద్వాలగా తీర్చిదిద్దాలి.. మున్సిపల్‌ చైర్మెన్‌ టపాలకృష్ణవేణి

గద్వాల గద్వాల పట్టణంను ప్లాస్టిక్‌ రహిత గద్వాలగా తీర్చిదిద్దాలని మున్సిపల్‌ చైర్మెన్‌ టపాల కృష్ణవేణి రామాంజనేయులు ప్రజలుకు పిలుపునిచ్చారు. శనివారం గద్వాల గాందీ చౌక్‌ నుండి ప్రతి దుకాణదారులను కలిసి వారికి గులాబి పువ్వు ఇస్తు ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లు వాడకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణం చెడగోడుతున్న ప్లాస్టిక్‌ బూతంను అందరు బహిష్కరించాలన్నారు. వాటికి బదులుగా బట్టసంచులు, కాగితం, సంచులు వాడాలని సూచించారు. ప్లాస్టిక్‌ కవర్లు వాడటం వల్ల వాటిని మురుగుకాల్వలలో వేయడం, రోడ్లపై పడవేయడం జరుగుతుందని అవి మురిగిపోకుండా భూసారం నాశనం చేయడమే కాక పశువులకు కూడా హాని చేస్తున్నాయని తెలిపారు. ప్రతి దుకాణదారుడు స్వచ్చందంగా ప్లాస్టిక్‌ కవర్లు వాడకుండా విడనాడి ప్రజలకు మార్గదర్శకులు కావాలని ఆమె సూచించారు.