ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ఖమ్మం,మే31(జ‌నం సాక్షి):  ఖమ్మం జిల్లా కేంద్రం వైరా రోడ్డులోని డాంబ్రో ఫర్నీచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్‌ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. సమాచారం అందుకున్న అదనపు డీసీపీ సురేశ్‌ కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.