మైక్రో ఇరిగేషన్‌కు ప్రశంసలు వచ్చాయని వెల్లడి
హైదరాబాద్,మే31(జనం సాక్షి): 2018-19 సంవత్సరానికి ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్ వై) సంబంధించి యాక్సిల్లరేటెడ్ ఇరిగేషన్ బెన్ ఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) లో భాగంగా ప్రతీ క్షేత్రానికి నీరు, తక్కువ నీరు ఎక్కువ పంట (ఫర్ డ్రాప్ మోర్ క్రాప్), వాటర్ షెడ్స్ అభివృద్ధికి 7,190 కోట్ల రూపాయలతో కార్యచరణ ప్రణాళికను రాష్ట్రస్ధాయి శాంక్షన్ కమిటీ సమావేశం ఆమోదించింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ..2018-19లో (ఏఐబీపీ) ద్వారా 5,093 కోట్లతో 2,80,333 హెక్టార్లు, క్యాడ్ వామ్ ద్వారా రూ.295 కోట్లతో 1,67,691 హెక్టార్లు, ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ ద్వారా రూ.749 కోట్లతో 1,18,000 హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మైక్రోఇరిగేషన్ అమలుపై జర్మనీ నుండి వచ్చిన కేఎఫ్ డబ్ల్యూ మిషన్ టీం తెలంగాణలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలును అభినందించిందన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఇప్పటి వరకు 7.2 లక్షల హెక్టార్లకు నీటి వసతి కల్పించామని విూ సేవలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసే అవకాశం కల్పించామని, పీఎంఎస్ కేవై అమలుపై ఖీఎ/ూఐ ఆధారిత అంతర్గత ఆడిట్ నివేదికను కూడా కేంద్ర వ్యవసాయశాఖ ఆమోదించిందని తెలిపారు. రైతులు మైక్రో ఇరిగేషన్ ను వినియోగించుకుంటు న్నారని, వివిధ పంటలలో వాడే నీటి వినియోగం 30 నుండి 40 శాతం తగ్గిందని సీఎస్ అన్నారు.
(ఏఐబీపీ)ద్వారా 11 ప్రాజెక్టులను 24,574 కోట్లతో 6.370 లక్షల హెక్టార్లకు నీటివసతి కల్పించాలని లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 3.099 లక్షల హెక్టార్ల ఇరిగేషన్ పొటెన్షియల్ ను కల్పించామన్నారు. కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ వర్క్ కింద క్రింద 11 ప్రాజెక్టులలో రూ.1567 కోట్లతో 5,31 లక్షల హెక్టార్లకు ఇరిగేషన్ పొటెన్షియల్ కల్పించాలని లక్ష్యం కాగా.. 2018-19 లో 1,677 లక్షల హెక్టార్లకు నీటి వసతిని కల్పించాలనేది లక్ష్యమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ క్రింద రూ.459 కోట్లతో 575 వాటర్ బాడీస్ క్రింద నీటి వసతి లక్ష్యం కాగా.. 81 వాటర్ బాడీస్ పనులు పూర్తిచేసి 2541 హెక్టార్ల నీటి వసతి పునరుద్ధరించామన్నారు. 2018-19 లో 494 వాటర్ బాడీస్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, వికాస్ రాజ్, పార్ధసారధి, వ్యవసాయశాఖ కవిూషనర్ జగన్ మోహన్, హార్టికల్చర్ కవిూషనర్ వెంకట్రామిరెడ్డి, మల్సూర్, ఆర్ధిక శాఖ అడిషనల్ సెక్రటరి రామ్మోహన్ రావు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు నాగేశ్వర్ రావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




