ఫలించిన ప్రేమ కథ
పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమజంట
మహబూబాబాద్ బ్యూరో-జులై (జనంసాక్షి)
రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ గత రెండురోజులక్రితం ఇంటినుండి వెళ్లిపోయిన ప్రేమ జంట పెద్దల సమక్షంలో ఒక్కటైయ్యారు. గార్ల డిగ్రీ కళాశాలలో చదువుతున్న భూక్య శైలజ దారావత్ ప్రసాద్ లు గత రెండేళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూ ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో గత రెండు రోజులక్రితం ఇంటినుండి వెళ్లిపోయారని యువతి తల్లిలీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బాణోత్ వెంకన్న ప్రేమికులను వెతికి పట్టుకొని స్థానిక స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా ఇద్దరు ఒకరినిడిచి ఒకరుండలేరని వారిని ఒక్కటి చేయాలని కోరగా తల్లిదండ్రులకు,ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురి గ్రామపెద్దలు, రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
Attachments area