-ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి.
-పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి.
-వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు.
ఏటూరునాగారం, జూలై 27(జనంసాక్షి):-
ఏటూరునా గారం మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం,తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ వరకు పోడు సాగుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఆనంతరం ధర్నా నిర్వహించారు.
తదుపరి జరిగిన సభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బిరెడ్డి సాంబశివ అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో పోరాటాల ఫలితంగా దరఖాస్తులు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములను 2018 వరకు సాగులో ఉన్న వారికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ హక్కు కల్పిస్తామని కెసిఆర్ పేర్కొన్నారని, కెసిఆర్ చెప్పిన విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో కెసిఆర్ తీర్మానం ప్రవేశపెట్టకపోతే ములుగు ఎమ్మెల్యే సీతక్కైన పెట్టాలని డిమాండ్ చేశారు.లేనియెడల సాగుదారులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ విధానం 2022 తెచ్చి గిరిజనులకు పిసా చట్టాన్ని ధిక్కరించి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాలు అప్ప చెప్పడానికి సిద్ధమవుతుందని పేర్కొన్నారు. దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని లేనియెడల భవిష్యత్తులో హైదరాబాదు వరకు పాదయాత్ర చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం బంధాల. ఏటూరు నాగారం మండలం రొయ్యురు నుండి ఎలిశెట్టిపల్లి వరకు పూర్తిగా రోడ్డు చెడిపోయిందని అదేవిధంగా జంపన్న వాగు పై ఎలిసెట్టి పెళ్లి వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని. కన్నాయిగూడెం మండలం కంతనపల్లి రోడ్డుకు. చెరువుకు అటవీ అధికారులు అనుమతులు లేవని నిలిపివేశారని వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో 60 వేల ఎకరాల ఫారెస్ట్. రెవెన్యూ ల మధ్య వివాదాస్పద భూములు ఉన్నాయని వీటిని జాయింట్ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి.తుమ్మల. వెంకటరెడ్డి. జిల్లా నాయకులు గఫూర్ పాషా.ఎండి యాకుబ్. ఆదినారాయణ. ఆదిరెడ్డి. కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు అమ్జద్. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి రెడ్డిసాంబశివ. జ్ఞానం వాసు. కుమ్మరి శ్రీను. చిట్టిబాబు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్. గిరిజన సంఘం నాయకులు గొంది రాజేష్. కోరం చిరంజీవి.జజ్జరి దామోదర్. దిగ్గి చిరంజీవి. తోలెం కృష్ణయ్య.కావిరి సుధాకర్. జాగటి చిన్న. తదితరులు పాల్గొన్నారు.
Attachments area