Wednesday, 4 November 2026

ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు కృషి

 ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి
బిజినేపల్లి, జనం సాక్షి .ఆగస్టు 19 : ఫిర్యాదుదారులు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వలన బాధితులకు సత్వరమే న్యాయం జరిగేటట్లు కృషి చేస్తానని ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి అన్నారు శుక్రవారం బిజినేపల్లి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టి అనంతరం మాట్లాడారు గ్రామాల్లో ఎవ్వరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపలతో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.  గ్రామాలలో నిత్యం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచి దొంగతనాలు . అక్రమ వ్యాపారాలు జరగకుండా ఎక్కడికక్కడే ఉక్కు పాదం మోపుతానని ఆయన అన్నారు ఎస్సైగా విధులో చేరిన ఆయనను మండల మత్యకార సహాకార సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు పుష్పగుచ్చంతో శాలువాతో ఎస్సై కి స్వాగతం పలికారు ఈ . కార్యక్రమంలో మండల మత్స్యకార సహాకార సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల అల్లాజీ, ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యక్షుడు సోప్పరి బాలస్వామి, సలహాదారుడు పొల కృష్ణయ్య, నట్టల బాలస్వాలు, పెంటయ్య తదితరులు ఉన్నారు.