ఫోటోకు సై.. ఫిజికల్ గానై..
డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో ఘనంగా జరుపాలని తెరాస ప్రభుత్వం భావించి ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కోసం డోర్నకల్ మండల,పట్టణం నుండి తెరాస శ్రేణులు భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకోవాలని రెండు రోజుల ముందుగానే పట్టణ నాయకులు ప్లాన్ చేసుకున్నారు.అందుకు తగ్గట్టుగానే జన సమీకరణ చేశారు.అయితే ఉదయం 10 గంటలకు మున్సిపాలిటీ పరిధిలోని తెరాస లీడర్లు పెట్రోల్ పంపు వద్దకు చేరుకొని ర్యాలీ ప్రారంభించారు.ఇందుకు మీడియా ఫోటోలో పడ్డేందుకు పోటీపడ్డారు.ర్యాలీ బయలుతేరి కిలో మీటర్ (మున్నేరు నది) దాటకు ముందే తిరుగుపాయనమైయ్యారు.2 కిలోమీటర్ల తర్వాత తెరుకున్న పట్టణ నాయకత్వం శ్రేణులు మాయంపై అందోళనకు గురైయ్యారు.నది అవతల ఉయ్యాలవాడ క్రాస్ రోడ్డు వద్ద వీరికోసం నిరిక్షించి వీరు రా..రూ అని రూడి చేసుకోని ముందుకు సాగరు.
Attachments area
|