ఫోటోగ్రాఫర్స్ కుటుంబాలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి
సూర్యాపేట (జనంసాక్షి): సూర్యాపేట పట్టణ ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొచ్చెర్ల రవి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ గోలి వినోద్ కుమార్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్ ను ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ సంఘ నాయకులతో కలిసి శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు.కుటుంబ భరోసాలో ప్రతి ఒక్కరు చేరాలని, ఏదైనా జరిగినప్పుడు కుటుంబానికి అండగా అసోసియేషన్ నుండి సహకారం అందుతుందని చెప్పారు. ప్రోగ్రామ్స్ వెళ్లేటప్పుడు హెల్మెట్ , కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.అజాగ్రత్తగా ఉంటే ఒక కుటుంబం రోడ్డున పడుతుందని, జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుణగంటి సురేష్ , ఆయిటిపాముల మల్లికార్జున్ , జిల్లా ఉపాధ్యక్షులు వాసు, మాధురి స్టూడియో నగేష్, సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షులు నల్లమాస రాము గౌడ్, తుమ్మకొమ్మ మధు , ఓరుగంటి చంద్రశేఖర్ , సీనియర్ ఫోటోగ్రాఫర్ దుర్గారావు , నెల్లుట్ల శ్రీకాంత్, పట్టణ,ప్రచార కార్యదర్శి తుమ్మల క్రాంతి కుమార్, సంపత్ నాయుడు, జగన్, శంకర్ రెడ్డి, బన్నీ, పాల్వాయి నాగరాజ్ , కొచ్చర్ల వీరేష్ , శ్రవణ్ , ఉపేందర్ , అరవింద్ , తుమ్మల నవశ్రీ పాల్గొన్నారు.