Thursday, 5 November 2026

ఫోటో రైట్ అప్: ఎమ్మెల్సీ కవితను పరామర్శిస్తు న్న ఎమ్మెల్యే రాజయ్య

బిజెపి నాయకులు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు
… ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 24, ( జనం సాక్షి ): బిజెపి నాయకులు యాత్రల పేరుతో టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్ప వని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం
హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ నివాసం నందు  నిజా మాబాద్ లోకల్ అథార్టీస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మార్యద పూర్వకంగా కలిసిఇటీవల కల్వకుంట్ల కవిత నివా సం పై బీజేపీ దుండగులు విచక్షణరహితంగా చేసి న దాడి విషయమై ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కవితని పరామర్శించి తన ప్రగాఢ మద్దతు తెలి పారు. దాడిని ఖండిస్తూ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ పాదయా త్రను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడం జరి గిందని ఎమ్మెల్సీ కవిత కి వివరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ య్య మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ వ్యక్తిగతంగా నా మద్దతు, అదేవిధంగా  నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల  మద్దతు తప్పక ఉంటుందని అన్నారు. బీజేపీ నాయకులు ఇకనైనా వ్యక్తిగత విమర్శలకు పోకుండా సిద్ధాంత పరమైన రాజకీయలు చేయాలే గాని రాజకీయ దురుద్దేశంతో విచక్షణ రహితంగా దాడులకు దిగి తే ప్రతిదాడులు తప్పవని బీజేపీ నాయకులను ఉధ్యేశించి ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొ న్నారు.