ఫ్యాక్స్ డైరెక్టర్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి)
రుద్రంగి మండలకేంద్రానికి చెందిన ప్యాక్స్ డైరెక్టర్ మరియు రైతుబందు కన్వీనర్ కేసిరెడ్డి నర్సారెడ్డి కూతురి వివాహం ఆదివారం రుద్రంగి లో జరుగగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.పెళ్లి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించి స్వాగతం పలికిన స్థానిక ప్రజా ప్రతినిధులు.ఎమ్మెల్యే వెంట టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,ఎంపిపి గంగం స్వరూప మహేష్,జడ్పిటీసీ గట్ల మినయ్య ల తో పాటు మండల ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.