: మధుర నగర్ కాలనీ నూతన అధ్యక్షులుగా కొండల్ రెడ్డి
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 21
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వంజ కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మల్లారెడ్డి, సెక్రటరీగా అజయ్ రెడ్డి, కోశాధికారిగా శివకుమార్, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు బిఎం నాయక్, కృష్ణ, పురుషోత్తం రెడ్డి, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం కాలనీ అధ్యక్షులు కొండల్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలతో కాలనీ అభివృద్ధి కోసం పాటుపడి కాలనీలో ఉన్న డ్రైనేజీలు సిసి రోడ్లు వివిధ మౌలిక సదుపాయాలు సకాలంలో పూర్తి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానన కాలనీ అధ్యక్షులు తెలిపారు.