కాంగ్రెస్,బిజెపిల ఉచ్చులో ఉన్న పార్టీలను బయటకు రప్పించాలి
తెలంగాణ పథకాలకు ప్రాచుర్యం కల్పించాలి
హైదరాబాద్,మే5(జనం సాక్షి): కెసిఆర్ ప్రకటించిన జాతీయ ఫ్రంట్‌లో కదలిక రావాలంటే మరింత చురకుగా సిఎం కెసిఆర్ కదలాలి. వివిధ పార్టీలను కార్ఆచరణలోకి దింపాలి. ప్రజల్లో నమ్మకం కలిగించలేఆ వాటిని ప్రోత్సహించాలి. అలాగే ఆయా రాష్ట్రాల్లో వాటికున్న గౌరవప్రదస్థానం ఎంతో కూడా బేరీజు వేసుకోవాలి.
కేంద్రంలోని కాంగ్రెస్,బిజెపిల పాలనను నిందిస్తున్న తరుణంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకుండా ఉన్నాయి. వాటితో జతకడితే వచ్చే లాభం కన్నా నస్టమే ఎక్కువ. ఇటీవల సమాజ్‌వాది నేత, యూపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ వచ్చి సిఎం కెసిఆర్‌తో చర్చలు జరిపారు. అయితే ఆయన సిఎంగా ఉన్న హయాంలో యూపిలో అరాచక పాలన సాగిందన్న అపవాదు ఉంది. అక్కడ రౌడీయజిం, గూండాయిజం పెరిగిపోయింది. పాలనలో వారిదే పెత్తనంగా సాగింది. ఇలాంటి ఆరోపణలు ఉన్న కారణంగానే యూపిలో సమాజ్‌వాదీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రాంతీయ పార్టీలను ఎంచుకని ముందుకు తీసుకుని వెళ్లేముందు నేతల ఇమేజ్ కూడా సిఎం కెసిఆర్ గమనించాల్సి ఉంటుంది. మరోవైపు మమతా బెనర్జీ,అఖిలేష్ యాదవ్, డిఎంకెలు కాంగ్రెస్ ఫ్రంట్‌ను వీడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలాంటప్పుడు వీరిని పట్టుకుని వేళ్లాడినా లాభం ఉండబోదు. నియంతలా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరితో విసిగిపోయి, పదేండ్ల యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ పాలన నుంచి ఇంకా బయటపడలేని రాజకీయాలకు చరమగీతం పాడాలని కేసీఆర్ ప్రకటించిన ప్రజాఫ్రంట్ కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. జాతీ యస్థాయిలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మూస పాలనకు భిన్నంగా రైతు సంక్షేమ నినాదంతో కేసీఆర్ ముందుకు రావడం ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ప్రతిపక్షాలు సైతం ఇందుకు సై అంటున్నాయి. తెలంగాణలో జరుగుతన్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఓ రకంగా కెసిఆర్‌కు ఇమేజ్ తెచ్చిపెట్టాయి. తెలంగాణ అభివృద్ధిపై ఇప్పుడు దేశరాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ దేశానికి సరికొత్త దిశ, దశ చూపెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన సహజంగానే అన్ని పార్టీలకు ఆదరువుగా కనిపించింది. మాది మూడో ఫ్రంట్ కాదు.. ప్రజాఫంట్ అని, తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వెంటనే అనేకమంది మద్దతు పలికారు. తమ సొంత విధానాలను దేశంపై రుద్దుతూ రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కార్‌పై తిరుగుబాటు జెండా
ఎగురేయాలన్న కోరిక అందరిలోనూ ఉంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వారు ఎదురుతిరుగుతూనే ఉన్నారు. అయితే కెసిఆర్ మాత్రమే ఫ్రంట్ కట్టి నిలదీసేందుకు ముందుకు వచ్చారు. విపక్షంగా కాంగ్రెస్ గత నాలుగేళ్లుగా విఫలం అవుతూ వస్తోంది. ఈ దశలో ప్రత్యామ్నాయం వచ్చిందనే భరోసా ప్రజల్లో కలిగింది. ప్రజాఫ్రంట్ ఆవశ్యకతను గుర్తించారు. దేశ ప్రజల ఆశలు నెరవేరాలంటే ప్రజాఫ్రంట్ ఏర్పాటు ఇప్పుడు తక్షణ అవసరం. అదీ కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ అయ్యిండాలన్న కెసిఆర్ ప్రకటన ఓ రకంగా ఈ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్న వారికి బాగా నచ్చింది. ఏడు దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటున్నాయి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేండ్ల యూపీఏ పాలన కుంభకోణాల పుట్టగా మారడంతో ప్రజలు ఏవగించుకున్నారు. ఫలితంగా బీజేపీకి సంపూర్ణ అధికారం అప్పగించారు. ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రజల పరిస్తితి పెనంవిూంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. పెద్దనోట్ల రద్దు,జిఎస్టీ నిర్ణయాలతో ప్రజల బతుకులు భారంగా మారాయి. ఎన్నికల సమయంలో మూడోఫ్రంట్ పేరుతో హడావుడి చేసే పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరు. మోదీ నాలుగేండ్లుగా నిరంకుశంగా పరిపాలిస్తున్నా నోరెత్తనివారు ఎన్నికల ముందు, తర్వాత తమకు ఎలా న్యాయం చేయగలుగుతారని ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఈ సమయంలోనే ప్రజాఫ్రంట్ పేరుతో స్పష్టమైన ప్రణాళికతో ముందుకొచ్చిన కేసీఆర్‌పై ఆశలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడితే కరెంటు, నీటి కష్టాలు ఎదురవుతాయని విమర్శించినోళ్లకు సమాధానం ఇచ్చారు. పాలనాపగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయ్యేలోగా కరెంటు కష్టాలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. ఏండ్లుగా సాగునీటి బాధలతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టారు. చెరువుల పునరుద్దరణ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల వేగం కళ్లమందు కనిపిస్తున్న సాక్ష్యం. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించిన మిషన్ కాకతీయ, తాగునీటి కష్టాలను తీర్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల బృందాలు ఈ పనులను పరిశీలించి ప్రశంసిస్తుండటం విశేషం. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. కుల వృత్తులకు జీవం పోసి ఉపాధి మార్గాలను పెంచారు. అన్ని కులాల వారికీ సమప్రాధాన్యం కల్పించారు. కేవలం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే కాకుండా ఒంటరి మహిళలకూ పింఛను అందిస్తున్నారు. వివిధ కులవృత్తుల వారికీ పింఛన్లు అమలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను అందుకుంటున్నది. ఈ కార్యక్రమాలన్నీ కెసిఆర్ పాలనాదక్షతకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అందుకే కెసిఆర్ ఫ్రంట్ ప్రకటన సహజంగానే రాజకీయ పార్టల్లో ఆశలు నింపింది. ఈ ప్రయత్నం సఫలీకీథం కావాలంటే కెసిఆర్ మరింత చురుకుగా ,జగరూకతతో సాగాలి. కాంగ్రెస్,బిజెపి ఉచ్చులో ఉన్న పార్టీలను బయటకు లాగాలి. అప్పుడే విజయం సాధ్యం అవుతుంది.




