ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోచంపల్లి లోని 8వ వార్డులో ఫ్రీడం పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం రెండు ఎకరాలలో మూడు రోజుల్లో ఫ్రీడం పార్క్ ను అభివృద్ది చేయడం అభినందనీయం అని పార్కులో భారత దేశ చిత్రపటంలో 75 అక్షరం వచ్చే విధంగా చిత్రీకరించడం ఆకర్షణీయంగా ఉందని , ఇది శాశ్వతంగా ఉండిపోయే కార్యక్రమ్మం అని మొత్తం పార్కులో 7500 మొక్కలు నాటేందుకు టార్గెట్ విధించిన్నట్లు అంధులో 1050 మొక్కలు నాటడం జరిగిందని మిగితావి కూడా నాటి కార్యక్రమాని విజయవంతం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను, సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ లింగస్వామి, మున్సిపల్ కమీషనర్ బాస్కర్, అందరూ కౌన్సిలర్లు, ఆర్ పి లు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.