బండి సంజయ్ అరెస్టుకు రుద్రూర్ లో నిరసన

రుద్రూర్ (జనంసాక్షి):
బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా , బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం (ఆగస్టు 23,2022) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ రుద్రూర్ మండల బీజేపీ నాయకులు రుద్రూర్ బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేశారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ కుర్మాజీ సాయిలు,
గజేందర్, సులేమాన్ ఫారం సాయిలు, తోట శంకర్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.