బండి సంజయ్ ను కలిసిన భాజపా మండల నాయకులు

మండలంలోని సమస్యలపై వివరణ

శాలువాతో సత్కారం

మానకొండూరు, ఆర్ సి, జులై 22( జనం సాక్షి)

కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను మానకొండూరు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన నివాసంలో శనివారం కలిశారు. ఈ సందర్భంగా మానకొండూరు భాజపా మండలాధ్యక్షులు రాపాక ప్రవీణ్ సంజయ్ కుమార్ ను శాలువా కప్పి సత్కరించారు. మండలంలోని పలు సమస్యలు ఎంపీ దృష్టికి తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆయన కు వివరించారు. బిజెపి జిల్లా కార్యదర్శి గంగిపల్లి ఎంపిటిసి రంగు భాస్కరాచారి, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, దూలం కిరణ్ గౌడ్, మియాపురం లక్ష్మాచారి, వంగల ఆంజనేయులు, వుషకొయిల రమేష్, ఎదులాపురం అశ్వన్ తేజ, పూసాల సాయికుమార్, రుద్రోజు గణేష్, తాడూరి కిరణ్ రెడ్డి, కొండ్ర వరప్రసాద్, మడ్డి రాకేష్, కాల్వ సాయి, రేణిగుంట సాగర్ తదితరులు ఎంపీ ని కలిసిన వారిలో ఉన్నారు.

తాజావార్తలు