జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయలాను దర్శించుకున్న దక్షిణ మధ్య రైల్వే డి.ఆర్.యం
. అలంపూర్ జూలై 22( జనంసాక్షి )మహా శక్తి పిఠలలోఒకటైన జోగులాంబ బాల బ్రమేశ్వర స్వామి ఆలయాలను శనివారం దక్షిణ మధ్య రైల్వే డి ఆర్ యం లోకేష్ వైష్ణోయి దర్శించు కున్నారు. వీరికి ఆలయ ఛైర్మెన్ బి. చిన్న కృష్ణయ్య, ఆలయ అర్చకులతో కలసి పూర్ణ కుంభ స్వాగతం పలికారు.అనంతరం ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా డి ఆర్ యం కు శాలువా పూల మాలతో సత్కరించారు. ఆలయ విశిష్టత ను ఆయనకు వివరించి, తీర్థప్రసాదం అందజేశారు.డి ఆర్. యం వెంట రైల్వే డి.ఐ.జి. అశోక్ కుమార్ శుక్ల
రైల్వే అధికారులు పాల్గొన్నారు.