Tuesday, 3 November 2026

బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం

నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణం గాంధీ చౌక్‌లోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉన్న అబ్ధూల్ మజిద్‌కు చెందిన హెచ్‌ఎంటీ కలెక్షన్స్ అనే బట్టలషాపు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ. 20లక్షల ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది పంచనామాలో తేలింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *