బడి తండాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

 

రుద్రంగి ఆగస్టు 26 (జనం సాక్షి);
ఉమ్మడి మానాల లో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ భూమయ్య,తాసిల్దార్ భాస్కర్ లు పాల్గొని వారి చేతుల మీదుగా ఇట్టి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని పేర్కొన్నారు.ఈ చెక్కులు మంజూరు కి కృషిచేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్, రుద్రంగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాం సుందర్ స్థానిక సర్పంచులు మాలి భాయి,మోహన్,మేనా మోహన్,లలిత రవి,మంగిలాల్, టిఆర్ఎస్ నాయకులు రాందాస్,భూమా,గంగాధర్ జూనియర్ అసిస్టెంట్ వినోద్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.