Tuesday, 3 November 2026

*బతుకమ్మ ఆటలతో విఆర్ఏల నిరసన!

 *పేస్కేల్ జాతరకు ప్రతి విఆర్ఏ తరలిరావాలి!
_________________________
లింగంపేట్ 25 ఆగస్టు (జనంసాక్షి)
 రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 32 వ రోజుకు చేరింది. విఆర్ఏల సమస్యల పై ప్రభుత్వం నుండి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో విఆర్ఏలు రోజుకో రీతిలో నిరసనలతో ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని విఆర్ఏలు ఆవేదన వ్యక్తంచేశారు.గురువారం లింగంపేట్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ముందు విఆర్ఏలు చీరలు కట్టుకొని ఆడ విఆర్ఏలతో సమానంగా బతుకమ్మ ఆట ఆడుతు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఏల మండల అధ్యక్షుడు అడ్డి రవికుమార్ మాట్లాడుతు నేడు జిల్లా కేంద్రంలో చేపడుతున్న పేస్కేల్ జాతరకు బోనాలు,పోతురాజుల విన్యాసాలతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టు తామని తెలిపారు.ప్రభుత్వం తమ సమస్యల పై స్పందించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటుయని అన్నారు.తమ సమస్యలను ప్రభుత్వం కాలయపన చేయకుండ పర్షికరించాలని కోరారు.కామరెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పేస్కేల్ జాతరకు ప్రతి విఆర్ఏ తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏల ఉపాద్యక్షుడు రమేష్, కోశాదికారి రమేష్,కాశీరాం,ఫరువవ్వ,నిజ్జని జ్యోతి.ఉల్లి జ్యోతి,సాయవ్వ మండల విఆర్ఏలు పాల్గొన్నారు.