బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్

ఎల్లారెడ్డి 29 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి మండలం లోని రుద్రా రం గ్రామం లో గురువారం ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్ స్థానిక గ్రామ పంచాయతీ అవరనలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటారు అని అన్నారు పల్లె ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని రంగు రంగు పూల తో. బతుకమ్మ పేర్చి మహిళలు చిన్నారులు ముస్తాబై బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ అడుతుపాడుతు కోలలు వేస్తూ ఉంటారు అని అన్నారు ఆమె వెంట గ్రామ మహిళలు పాల్గొన్నారు