Saturday, 7 November 2026

బతుకమ్మ చీరలు పంపిణీ

వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న
మల్దకల్ సెప్టెంబర్ 23 (జనంసాక్షి)మండలపరిధిలోని ఎద్దులగూడెం గ్రామంలో శుక్రవారం ప్రాథమిక పాఠశాల దగ్గరబతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్దకల్ వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న హాజరై ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచుల కోసం ప్రత్యేకంగా చీరలు తయారు చేయించి ఉచితంగా అందజేస్తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,డీలర్ ఈశ్వరమ్మ,మాజీ ఎంపిటిసి చంద్రశేఖర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, నెంబర్ సుజాత,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మధు,ప్రభాకర్, జమ్మన్న,తదితరులు పాల్గొన్నారు.
Attachments area