Wednesday, 4 November 2026

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన : కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్

ఎల్బీ నగర్ (జనం సాక్షి )  హస్తినాపురం  డివిజన్ పరిధిలో లోని   భూపేష్ గుప్తా నగర్/
అగ్రికల్చర్ కాలనీ జరిగిన కార్యక్రమంలో    కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ పాల్గొని  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భూపేష్ గుప్తా నగర్ ప్రభుత్వ పాఠశాలలో అగ్రికల్చర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో దీనిని ప్రజల సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్అధ్యక్షుడు సత్యం చారి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు డేరంగుల కృష్ణ కిట్టు యాదవ్ జంగారెడ్డి హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు