బతుకమ్మ చీరల పంపిణీ

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 మండల పరిధిలోని బీచుపల్లి, ధర్మవరం గ్రామాలలో సోమవారం స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు దసరా పండుగను పురస్కరించుకొని బీచుపల్లి సర్పంచ్ నర్సమ్మ, ధర్మవరం గ్రామ సర్పంచ్ మధునాయుడు ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు. ఈ ఈ కార్యక్రమంలో ధర్మవరం డీలర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, టిఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, మహిళా పొదుపు సంఘం సభ్యులు సరస్వతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.