*బతుకమ్మ చీరల పంపిణీ*

*పలిమెల, సెప్టెంబర్ 27 (జనంసాక్షి)* తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంధర్భంగా అందిస్తున్న చీరలను పలిమెలలో అందించారు. పలిమెల గ్రామంలోని మహిళలకు సర్పంచి జవ్వాజి పుష్పలత చేతులమీదుగా చీరల పంపిణీ చేసారు. సర్పంచ్ జవ్వాజి పుష్పలత మాట్లాడుతూ ప్రతీ మహిళ ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు బహుమతిగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆడ పడుచు కానుకగా ఈ చీరలను పంపిణీ చేసామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పుష్పలత, ఎంపిటిసి దందెర కళ్యాణి, కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.