హైదరాబాద్,జూలై10(జనం సాక్షి): డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలితీసుకుంది. ముందూ వెనక చూసుకోకుండా బస్సు నడపడంతో మూడేళ్ల చిన్నారి బలయ్యింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధి తారామతిపేట గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకున్నది. శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుర్ర తన్వీష్(3) రోడ్డు విూద ఆడుకుంటుండగా.. చిన్నారిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును చిన్నారి విూది నుంచి పోనిచ్చాడు. దీంతో తన్వీష్ బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. డ్రైవరీ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.




