Thursday, 5 November 2026

ఆగివున్న వాహనాన్ని ఢీకొన్న బైక్‌

స్పాట్‌లోనే ముగ్గురు మృతి

చిత్తూరు,జూలై10(జ‌నం సాక్షి): కురబలకోట సవిూపంలోని కడప, బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. రహదారిపై ఆగి ఉన్న ఐషర్‌ వాహనాన్ని వెనక నుంచి బైక్‌ వచ్చి వేగంగా ఢీకొంది. మృతులను కురబలకోట పంచాయతీ పుట్టారెడ్డిగారిప్లలెకు చెందిన చంద్రశేఖర్‌, దేవేందర్‌, దినేశ్‌గా గుర్తించారు. రహదారిపై పొగమంచు అలుముకుని ఉండడంతో ఆగి ఉన్న వాహనాన్ని గమనించకపోవడం, అతివేగం ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను మదనప్లలె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.