బస్ స్టేషన్ ను పునరుద్ధరించాలి:

*మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రయాణ ప్రాంగణాన్ని శుభ్ర పరిచి పునరుద్ధరించాలని కోరుతూ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి భావన ఆదినారాయణ తహశీల్దార్ దామోదర్ రావుకు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన కూడళ్లలో టాయిలెట్స్ లను ఏర్పాటు చేయాలని,ఇందిరమ్మ కాలనీ వాసులకు పట్టాల పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలను నిలిపి వేసి నిరుపేదలకు ఆ భూములను పంపిణీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.మొత్తం తొమ్మిది అంశాలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు.