Tuesday, 3 November 2026

బాక్సర్‌ హసముద్దీన్‌కు ఎంపి కవిత అభినందనలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన బాక్సర్‌ 24 ఏళ్ల హసముద్దీన్‌  ఇవాళ ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిశారు. ఖండాంతరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పిన హసముద్దీన్‌ ను ఎంపీ కవిత ప్రశంసించి, సత్కరించారు. హసముద్దీన్‌ ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌ లో మరిన్ని పతకాలు సాధించాలని ఎంపీ కవిత ఆకాంక్షించారు. హసముద్దీన్‌ తన ప్రతిభతో భారతీయులు గర్వించేలా చేశారని..హసముద్దీన్‌ ను కలవడం సంతోషంగా ఉందని ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. తెలంగాణకు చెందిన హసముద్దీన్‌ 56 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలిచిన విషయం తెలిసిందే.