మోకాళ్లపై కూర్చుని మహిళల నిరసన

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మోకాళ్లపై కూర్చుని మహిళలు వినూత్న నిరసనకు దిగారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద వీరు నిరసనకు దిగారు.  104 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీవో 151 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు.  వాహనాలను పూర్తి ఫిట్‌నెస్‌తో నిర్వహించాలని శుక్రవారం చంద్రన్న సంచార చికిత్స (104) ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు కలక్టరేట్‌ వద్ద మోకాళ్ళ విూద నిలబడి నిరసన తెలిపారు. అలాగే  అంగన్వాడీలు, చెవిలో పువ్వులు పెట్టుకుని ధర్నాలు చేపట్టారు.

తాజావార్తలు