బాడీ ఫ్రీజర్ ను అందజేసిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూరు ఆగస్టు 19 జనం సాక్షి : తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి నూతనంగా కొనుగోలు చేసిన బాడీ ఫ్రీజర్ ను దత్తప్పగూడెం గ్రామానికి బహుకరించారు. ఈ బాడీ ఫ్రీజర్ ను ఇప్పించిన దాత కంచర్ల రామకృష్ణారెడ్డి కి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుగు శోభ సోమయ్య, కో ఆప్షన్ ఎంపీటీసీ ఎస్కే సాజిద్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి వెంకటేష్, ఉపసర్పంచ్ జోజప్ప, వార్డు మెంబర్లు గనగాని యాదగిరి, ఎలుగు గంగ మల్లు, పార్టీ సీనియర్ నాయకులు గుండు యాదయ్య, పనస రాములు, ఎలుగు ఐలయ్య కట్కూరి అంజిరెడ్డి, మామిడి వెంకటేష్, ఎలుగు మచ్చ గిరి, రహీంపాష, ముంత మల్లికార్జున్, ఆంజనేయులు, గనగాని పాండు తదితరులు పాల్గొన్నారు.