బాధితులకు భరోసాగా ద్యాప నిఖిల్ రెడ్డి..
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, అక్టోబర్ 13 (జనంసాక్షి):
బడుగు బలహీన వర్గాల ప్రజలకు.. కష్టాల్లో ఉన్న, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. గురువారం ఊర్కొండ మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన బుసమోని రాములు (65) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని గుడిగానిపల్లి సర్పంచ్ రజిత కృష్ణయ్య మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో పానుకూలంగా స్పందించిన సర్పంచ్ వెంటనే బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. 5వేల రూపాయలు అందించారు. ఆదేవిదంగా మాధారం గ్రామ పంచాయతి పరిధిలోని చెన్నాయపల్లి గ్రామానికి చెందిన తినేటి నర్సమ్మ(50) గురువారం మృతి చెందారు. వారి కుటుంబానికి స్థానిక నాయకులు పరామర్శించి మాధారం సర్పంచ్ నిఖిల్ రెడ్డి ఎర్పాటు చేసిన 5వేల రూపాయలు బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంతో పాటు గ్రామంలోని బాధితులకు అండగా ఉంటున్న నిఖిల్ రెడ్డికి మండల ప్రజలు, గ్రామస్తులు జేజేలు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డీ ఎన్ ఆర్ యువసేన సభ్యులు గుడిగాని పల్లి సర్పంచ్ రజిత కృష్ణయ్య, మాజీ సర్పంచ్ జంగయ్య, తిరుపతియ్య, బొందయ్య, పరుశరాములు, మల్లయ్య, బిరయ్య, సురేందర్ రెడ్డి, కిష్టయ్య, ముదివేంటి శ్రీను, నరసింహ్మ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.