రేపేసిపిఐ జాతీయ మహాసభలు వందలాదిగా తరలిరండి

 జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పిలుపు అక్టోబర్ 13 (జనంసాక్షి) గట్టు
 ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు CPI పార్టీ జాతీయ  మహాసభలు నడుస్తున్నాయి. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు ఎంతో హార్భాటంగా హాట్టహాసంగా  నిర్వహించబడుతున్నాయి.35 దేశాల నుంచి  29 రాష్ట్రాల నుంచి అలాగే దేశం మేధావులు ఆర్థిక నిపుణులు విశ్లేషకులుఈ మహాసభలలో పాల్గొంటారని ఆంజనేయులు గురువారం నాడు మీడియా ప్రకటనలోతెలిపారు .
 ఈసందర్బంగా సీపీఐ జాతీయ మహాసభలకు వందలాదిమంది విజయవాడకు తరలిరండీ.కర్నూల్ నుంచి విజయవాడకు ఈరోజు సాయంత్రం రైళ్లకు బయలుదేరడం జరుగుతుంది.తిరిగి విజయవాడ నుంచి 14 తేది సాయంత్రం మళ్లీ కర్నూల్ వరకు అక్కడి నుండి గద్వాల కు రైలు సౌకర్యం ఉంది. 14వ తేదీన విజయవాడ నగరంలో జరిగే భారీ బహిరంగ సభకు మనమందరం తరలి వెళ్లాల్సి ఉందని మరిచిపోకండి ఎన్ని పనులు ఉన్నా మహాసభలను విజయవంతం చేసేందుకుకార్యకర్తలు కార్మికులు యువకులు అధిక సంఖ్యలో తరలి రావాలని అయన కోరారు