బాధిత కుటుంబానికి అండగా బీఅర్ఎస్

బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్.
ఊరుకొండ, అక్టోబర్ 21 (జనం సాక్షి):
ఆపదలో ఉన్న వారికి.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరినాయక్ అన్నారు. శుక్రవారం ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల విమలమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శాసన సభ్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ తక్షణ సహాయంగా 5వేలు మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరినాయక్ మృతుని కుటుంబసభ్యులను ఓదార్చి తమవంతు సహౕయంగా 2వేలు మొత్తం 7వేల ఆర్థిక సహాయం మృతురాలి కుమారుడు వెంకటయ్యకు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరుశ రాములు, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, వార్డు సభ్యులు శాంతయ్య, నాయకులు బాలరాజు, హుస్సేన్, రాములు, అంజనేయులు, లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.