బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
రామగిరి, (జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన ముత్యం శంకరమ్మ కుటుంబానికి శనివారం రామగిరి సేవా సమితి సభ్యులు 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శంకరమ్మ బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడం తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కమాన్ పూర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణా రెడ్డి, సేవా సమితి సభ్యులు కాట రాజేందర్ గౌడ్, రాచకొండ శంకర్, అనవెని శ్రీనివాస్, కన్నూరీ శ్రీనివాస్, కాట శంకర్ గౌడ్, పడాల మొగిలి గౌడ్, మామిడి హరీష్, బానుక అంజి, తదితరులు పాల్గొన్నారు.