బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది..

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి):
ఊరుకొండ మండలంలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరు మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన మొల్ల రసూల్(75) వృద్ధుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ యువకుల ద్వారా తెలుసుకున్న జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త.. జనంపల్లి అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి దహన సంస్కరానికి రూ.5000/- ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి రూ.5000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్టి పైసలు మృతుని కూతురు జాంగిర్ బీ బేగం గారికి రూ.10,000/- కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి మరియు మాదారం సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి గారికి ఊరుకొండ గ్రామస్తులు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.