బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు26(జనంసాక్షి):
 మండలంలోని వాగ్ధరి గ్రామానికి చెందిన బీజేపీ కిషన్ మోర్చ ఉపాధ్యక్షుడు ఉయిక గంగాధర్ బార్య ఉయిక రేవతి ఇటీవల మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బలరాం తోపాటు సర్పంచ్ మురళి వెంకటేష్ గట్టు నారాయణ సాబ్లే సంతోష్ డాక్టర్ గంగాధర్ దేవురావ్ సంజీవ్ దేవిదాస్ గ్రామ పెద్దలు  తదితరులు ఉన్నారు.

తాజావార్తలు