Tuesday, 3 November 2026

విద్య,వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

    జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(26):
గోపాల్ పేట్ మండల కేంద్రంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందుతే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అందుకు అధికారులు కృషి చేయాలన్నారు ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు హరితహారం కార్యక్రమం లో 50 శాతం మొక్కల నే నాటినట్లు ఎపిఓ తెలిపాగా మిగతా 50 శాతం మొక్కలను నాటి న క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో మంజూరైన అదనపు గదుల నిర్మాణం గానీ కాంపౌండ్ వాల్ నిర్మాణం గానీ పనులలో అలసత్వం వహించిన వారి ఏజెన్సీని తొలగించి వారి స్థానంలో కొత్త ఏజెన్సీలకు పనుల ను అప్పజెప్పడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రతినెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల యొక్క పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలి అందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని అన్నారు మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒకరోజు సమావేశం నిర్వహించాలని ఎంఈఓ ను ఆదేశించారుప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు అంగన్వాడి సెంటర్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం,పౌష్టికాహారాన్ని అందజేయాలని అంగన్వాడి టీచర్లకు సూచించారు అదేవిధంగా గుజరాత్,కేరళ, రాష్ట్రాలలో రైతులు లాభసాటి పంటలు పండించడం ద్వారా వ్యవసాయ రంగం ఆయా రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు,రైతు బీమా,కళ్యాణ లక్ష్మి,ఆసరా పింఛన్లు సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు రైతులు వ్యవసాయ రంగంలో మూస పద్ధతిలో కాకుండా రైతులను ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా రైతులకు అధికారులు అవగాహన కలిగించాలని నూతన వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు బ్యాంకుల సహకారం ఉంటుందని మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్నవారికి నూతన వ్యవసాయ పద్ధతులను సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, వంటలు పండించే రైతుల ను అధికారులు ప్రోత్సహించాలన్నారు వాణిజ్య పంటలపై ప్రజలకు అవగాహన కలిగించాలని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్, జడ్పిటిసి మంద భార్గవి కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంపీడీవో హుస్సేనప్ప, ఎమ్మార్వో సునీత, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మతిన్ ,మరియు అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు