Wednesday, 4 November 2026

బాధిత కుటుంబాలకు బరోసనిస్తున్న ఇన్సూరెన్స్ లు

★బాధిత కుటుంబాలకు 10 లక్షల,4 లక్షల చెక్కులను అందించిన టిజిబి బ్యాంక్.
★ప్రతి వ్యక్తికి పీఎం జేజేబీవై,యస్బివై ఇన్సూరెన్స్ లు ఉండాలి.
సదాశివనగర్:ఆగస్టు27 (జనంసాక్షి) కరోన లాంటి కనికరం లేని రోగాలు వస్తున్న ప్రస్తుత కాలంలో కుటుంబంపై బాధ్యతోపాటు పిల్లలపై ప్రేమగల ప్రతిఒక్క తల్లిదండ్రులు కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవలసిన అవసరముందని నిజామాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రిజినల్ మేనేజర్ నారాయణ అన్నారు.మండలంలోని పద్మజీవాడి చౌరస్తాలో గల టిజిబి బ్యాంక్ నందు శుక్రవారం నిర్వహించిన శ్రావణ లక్ష్మి డిపాజిట్ సేకరణ మహోత్సవ సమావేశనికి ఆయన ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు.ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవ్వరికి తెలియదు,ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఇన్సూరెన్స్ లు వుంటాయని అందుకే పద్మజీవాడి టిజిబి బ్యాంక్ పరిధిలోని ఆయాగ్రామల ప్రజలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన,జీవన్ జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ లు చేసుకోవాలని,వాటితోపాటు యస్బిఐ లైఫ్,జనరల్ ఇన్సూరెన్స్ లు కూడా తప్పకుండా కలిగివుండలన్నారు.ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్తులకు తెలియజేశారు.
పద్మజీవాడి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీజాత మాట్లాడుతూ అన్ని బ్యాంక్ లకన్న మా బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎక్కువ ఇస్తున్నామని, సీనియర్ సిటిజన్ కి 6.6 గాను,మిగతవారికి 6.1 గాను అత్యాధికంగా అందిస్తున్నామన్నారు.అతి తక్కువ వడ్డీ రేటుతో 10 నిమిషాల వ్యవధిలో బంగారంపై రుణాలను ఇస్తున్నామన్నారు.ఖాతాదారులకు మేము ఎల్లప్పుడూ బ్యాంక్ సేవలను అందిస్తామన్నారు.గతంలో కల్వరాల్ గ్రామానికి చెందిన వంగల బ్రహ్మమ్ టిజిబి బ్యాంక్ లో 5వందల యస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ చేశారు.
ప్రమాదవశాత్తు అతను రోడ్డు ప్రమాదంలో మరణించినందున అతని కుమారుడు శ్రీనివాస్ కు 10 లక్షలు,అలాగే పద్మజీవాడి గ్రామస్థుడైన మెరుగు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మరణించినందున అతని భార్య రజితకు 4 లక్షల రూపాయల చెక్కులను ఆర్ యమ్ నారాయణ,మేనేజర్ శ్రీజాతలు అందజేశారు. అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడిపెద్ది కవిత,ఐకేపీ ఏపీఎం రాజిరెడ్డి,క్యాషియర్ సల్మాసుల్తాన,
వంశీ,బ్యాంక్ సిబ్బంది సాయిబాబా, శ్రీదర్ లత,బిసినెస్ కరస్పాండెంట్ రాజశేఖర్,రాజారెడ్డి,సియేలు రాములు,
స్రవంతి,గ్రామస్తులు సాకాలి సంతోష్, గంగచారన్, యాదుల్,హాజర్ తదితరులు పాల్గొన్నారు.