Wednesday, 4 November 2026

*బాధిత కుటుంబాలను పరామర్శించిన గండ్ర.

చిట్యాల28(జనంసాక్షి)
మండల కేంద్రంలోని చింతలపల్లె, చింతకుంట రామయ్యపల్లి గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోడెల కనకమ్మ, ఈర్ల  లింగయ్య కుటుంబ సభ్యులను బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, అనంతరం మృతి చెందిన వారి చిత్ర పటాల వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చింతకుంటరామయ్యపల్లి సర్పంచ్ ముఖిరాల మధువంశీకృష్ణ, ఎంపిటిసి దబ్బెట అనిల్, నాయకులు చిలుకల రాయకోమురు, లాండ సాంబశివరావు, పార్లపల్లి కుమార్, బుర్ర మల్లేష్, రాయకోమురు, ఉమ్మగాని సత్యనారాయణ, వేణు తదితరులు ఉన్నారు.
Attachments area