Wednesday, 4 November 2026

బాబుది వెన్నుపోటు రాజకీయం

– అప్పుడు ఎన్టీఆర్‌.. ఇప్పుడు కేసీఆర్‌పై కుట్ర పన్నారు
– తెలంగాణ వాదులు దాడులు చేస్తుంటే బాబును, పార్టీని కాపాడా
– దుర్మార్గునికి సాయం చేశానని ఇప్పుడు బాధపడుతున్నా
– చంద్రబాబు కంటే కేసీఆర్‌ వందబాళ్లు నయం
– పేద వర్గాల నాయకులను రాజ్యసభకు పంపించారు
– సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీనియర్‌ నేత మోత్కుపల్లి
హైదరాబాద్‌, మే28(జ‌నం సాక్షి ) : చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం అని, అప్పుడు ఎన్టీఆర్‌ను ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు .. ఇటీవల కేసీఆర్‌పై కుట్ర పన్నారన్నారని ఆ పార్టీ తెలంగాణ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను రాజకీయ కుట్రలకు బలయ్యానని.. అప్పుడు ఎన్టీ రామారావు కూడా అలాగే బలయ్యారని విమర్శించారు. ‘రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపారు.. నందమూరి, దగ్గుబాటి కుటుంబాన్ని వాడుకొని వదిలేశారన్నారు. అన్ని కుట్రలకు కుతంత్రాలకు బాబే కారణమని, మాట విూద నిలబడే వాడు నాయకుడు.. అవసరాల కోసం మారే వాడు కాదన్నారు. అలాంటివాళ్లకు చరిత్రలో నల్లటి పేజీ మిగిలిపోతుందని గమనించాలి మోత్కుపల్లి అన్నారు . తన రాజకీయ జీవితం కూడా నాశనం అయ్యిందని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణవాదులు దాడులు చేస్తుంటే.. బాబును, పార్టీని కాపాడానన్నారు. తెలంగాణలో పార్టీకి అండగా ఉంటానన్నావ్‌.. గద్దెనెక్కగానే మర్చిపోయావ్‌ అని విమర్శించారు. రాజ్యసభ అన్నావ్‌.. గవర్నర్‌ పదవి అన్నావ్‌.. రాజ్యసభ సీట్లను కోటీశ్వర్లుకు అమ్ముకున్నావ్‌. కేసీఆర్‌ నయం.. పేదవాళ్లకు రాజ్యసభ సీట్లిచ్చారు. దుర్మార్గుడికి సాయం చేశానని ఇప్పుడు బాధపడుతున్నా.. చంద్రబాబు మాట విూద నిలబడడు. ఆయనకు రాజకీయ, నైతిక విలువలు లేవు’ అన్నారు నర్సింహులు. తన రాజ్యాధికారం కోసం కులాల మధ్య కూడా పంచాయితీ పెట్టారని విమర్శించారు నర్సింహులు. ‘మాల-మాదిగల మధ్య చిచ్చుపెట్టి.. స్వలాభం పొందాలని చూశారని, ఇప్పుడు బ్రాహ్మణుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌పై కుట్ర పన్నినట్లు.. మొన్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్‌ తెలివి ఉన్నవాడు కాబట్టి.. పట్ట పగలు పట్టుకున్నాడు. దీంట్లో రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు ప్రధాన ముద్దాయిలు. కుట్ర, ద్రోహం అన్నవి చంద్రబాబు నైజంలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. ప్రత్యేక ¬దా విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని, ముందు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, తర్వాత మాట మార్చి ¬దా అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్యాకేజీ అద్భుతమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి.. మోదీపై ప్రశంసలు కురిపించలేదా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు గురించి కూడా
ఆయనే సలహా ఇచ్చానని చెప్పుకున్నారు. తర్వాత రద్దు మంచిది కాదని మాట మార్చారు. రద్దు సమయంలో వేసిన కమిటీకి ఛైర్మన్‌ ఎవరు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏపీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి.. లేకపోతే ప్రజలు తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ మోత్కుపల్లి మండిపడ్డారు.