హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని బార్కన్ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే బార్కన్ ప్రాంతంలో ఈ ఉదయం విద్యుత్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. దాంతో రెచ్చిపోయిన స్థానికులు పోలీసులపై కూడా స్థానికులు రాళ్లురువ్వారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు సమాచారం.




