బాలల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

గరిడేపల్లి, అక్టోబర్ 22 (జనం సాక్షి): బాలల పరిరక్షణ గ్రామంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ బానోతు ఉష అన్నారు. రేగులగడ్డ తండా గ్రామం యందు బాలల పరిరక్షణ సమితి కమిటీని ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాలల పరిరక్షణ కొరకు కృషి చేస్తూ వాళ్లకు ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే స్పందించి భరోసా కల్పించాలని కోరారు. బాలల పరిరక్షణ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ సిబ్బంది సాయి, సర్పంచ్ ఉష, ఉప సర్పంచ్ జ్యోతి,అంగన్వాడీ టీచర్ బుజ్జి, పద్మావతి ఆయాలు జానకి, చిట్టెమ్మ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.