Wednesday, 4 November 2026

కొమరం భీం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టిజెఎస్ నాయకులు

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 22
 అల్వాల్ పట్టణ కేంద్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ ఆధ్వర్యంలో టీజేఎస్ పార్టీ కార్యాలయావరణంలో కొమరం భీమ్ జయంతినిపురస్కరించుకునిఆయనచిత్రపటానికిపూలమాల వేసిఘనంగానివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ
ఆదివాసీల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం కొమరం భీమ్ అని గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీమ్ అని అణగారిన గిరిజన అడవి బిడ్డల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి గుండె నెత్తురులు దారా బోసిన ఆదివాసి వీరుడు కొమరం భీమ్ అని అన్నారు. నేటి ఆదివాసి యువత కొమరం భీం సోయం గంగులు మన్నెం లింగన్న లాంటి వారి జీవితాలను అధ్యయనం చేసి వారు చూపిన బాటలో నడుస్తూ ఆదివాసీలకు అడవులపై ఏజెన్సీ పై పూర్తి హక్కులు వచ్చేవరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు రవి ముదిరాజ్, విష్ణు, పవన్, అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.