బాలల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కలెక్టరేట్ లో మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పిల్లల సంరక్షణ బాలల హక్కులు కాపాడుట కోసం కృషి చేయాలని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ కలెక్టరేట్ సముదాయంలో పనిచేసే ఉద్యోగినులు పిల్లల సంరక్షణ, పిల్లల ఎదుగుదల , అభివృద్ధి ప్రేరణ కోసం బాలల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు ఈ  సంరక్షణ కేంద్రంలో సేవలు పొందవచ్చని తెలిపారు.జిల్లా కలెక్టరేట్ లో పని చేసే ఉద్యోగులందరూ ఈ బాలల సంరక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ , ఆర్డిఓ రాజేంద్ర కుమార్ , కలెక్టరేట్ ఏఓ శ్రీదేవి, సిడిపిఓలు శ్రీజ, విజయ చంద్రిక, జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ హుస్సేన, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు