బాలిక వైద్య ఖర్చులకు సహాయం చేసిన శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు

మంగపేట, సెప్టెంబర్ 5 (జనంసాక్షి):-

మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామ పంచాయతీ ప్రాజెక్టు నగర్ లోని వలస గొత్తి కోయ గూడెంకు చెందిన వట్టం జగన్ కూతురు వట్టం సింధు (9) 4 వ తరగతి చదువు తున్న అమ్మాయి తరచూ కళ్లు తిరిగి కింద పడుతు ఉండడంతో దగ్గర ఉన్న ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ చూపించగా డాక్టర్ అమ్మాయికి తలలో బ్రెయిన్ కి సంబంధిత వ్యాధి ఉందని తెలిపి తలకు సంబంధించిన టెస్టులు చేయాలని అట్టి పరీక్షలు వరంగల్ లో చేపించాలని చెప్పడంతో టెస్టులు చేపించడం కోసం వరంగల్ వెళ్లేందుకు కుడా డబ్బులు లేక ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ బాడిశ నాగ రమేష్ ను బాధిత కుటుంబం ఆశ్రయించి విషయం తెలపగా సేవ గుణంతో తన దారి ఖర్చుల నిమిత్తం తన వంతు సాయంగా 3000/-రూపాయలు అందజేసి దగ్గర ఉండి వరంగల్ పంపించారు.ఈ కార్యక్రమంలో బాడిష నవీన్,కొమరం నితిన్,స్నేహ కుమార్,చిట్యాల రాజశేఖర్, గంగెర్ల నాగరాజు,రమేష్,బాడిశ ఆదినారాయణ,చౌలం.వేణు, రామ్మోహన్,రాజు,చౌలంబాబు, మాధవ రావు, చెట్టుపల్లి.రామకృష్ణ,జాడి నరేందర్,పాల్గొన్నారు.